Pawan Kalyan: ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan predicts NDA will gain sure shot win

  • ఇవాళ మంగళగిరిలో ఓటేసిన పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా
  • భార్యతో కలిసి వారణాసి చేరుకున్న జనసేనాని
  • రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
  • పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన వారణాసి పయనమయ్యారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్డీయే భాగస్వామి పవన్ కల్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. మోదీ ఆహ్వానం నేపథ్యంలో, పవన్ కల్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వారణాసి చేరుకున్నారు. 

ఎయిర్ పోర్టులో ఆయనను జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని అన్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమకు మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 

ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి తన మద్దతు అందించి, శుభాకాంక్షలు తెలుపుతానని, ఆయన మూడోసారి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. వారణాసి వచ్చిన సందర్భంగా పవన్ మెడలో కాషాయ కండువాతో కనిపించారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వారణాసిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు.

Pawan Kalyan
Varanasi
NDA
Narendra Modi
Nomination
BJP
Janasena
  • Loading...

More Telugu News