Sai Dharam Tej: దేశపు జెండాకు ఉన్నంత పొగరు మీ గెలుపులో మాకుంటుంది: సాయి ధరమ్ తేజ్

Mega Hero Sai Dharm Tej Tweet Insuport of Janasenani pawan kalyan

  • ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేనాని గెలుపును కాంక్షిస్తోందని వ్యాఖ్య
  • నిజాయితీగా ప్రజాసేవ చేసే నిస్వార్థ నాయకుడంటూ ప్రశంసలు
  • పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా విష్ చేసిన మెగా హీరో

ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా సేవ చేసే నాయకుడి అవసరం ఎంతో ఉందని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు. ఈ లక్షణాలన్నీ ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయనే నిజం, ఆయనే బాధ్యత, ఆయనే న్యాయం.. ఏపీ ప్రజలు కోరుకుంటున్న నాయకుడు ఆయనేనంటూ ట్వీట్ చేశారు. ‘మన దేశ జెండాకు ఉన్న పొగరు మీ గెలుపులో మాకు ఉంటుంది’ అంటూ బాబాయ్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రజల ఆశీర్వాదంతో, నిజాయితీగా ప్రజాసేవ చేసే జనసేనానిని ఈ ఎన్నికల్లో విజయం వరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయనకు మరింత పవర్ ను కట్టబెట్టాలని, జనసేనానిపై, ఆయన ఆలోచనలపై, ఆయన విజన్ పై నమ్మకం ఉన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జరగబోయే ఎన్నికల్లో బాధ్యతగా ఓటేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Sai Dharam Tej
Janasena
Andhra Pradesh
AP Assembly Polls
Lok Sabha Polls
Pawan Kalyan
  • Loading...

More Telugu News