Nara Lokesh: నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: నారా లోకేశ్

Nara Lokesh condemns attack on pregnant in Annamayya district
  • అన్నమయ్య జిల్లాలో గర్భిణిపై దాడి
  • పెద్దిరెడ్డి పాపాలు శిశుపాలుడ్ని మించిపోయాయన్న లోకేశ్
  • మే 13న ప్రజలే తగిన శిక్ష విధిస్తారంటూ ట్వీట్ 
అన్నమయ్య జిల్లాలో ఓ గర్భిణీపై దాడి జరిగిన ఉదంతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాల పెద్దిరెడ్డీ... నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని మండిపడ్డారు. 

"తాగునీరు అడగడమే ఆ నిండు గర్భిణి చేసిన పాపమా? ఏంటీ దౌర్జన్యం? నిండు గర్భిణి అని చూడకుండా ఏంటీ అమానవీయ దాడి? అధికార మదంతో ఇన్నాళ్లూ సాగించిన అరాచకాలకు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలవకతప్పదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కూటగోళ్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి భార్య సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పాపాలకు తగిన శిక్షను మే 13న జనం విధిస్తారు పెద్దిరెడ్డీ!" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Peddireddy
Pregnant
Attack
TDP
YSRCP
Annamayya District

More Telugu News