China: ఇంటిని త‌గ‌ల‌బెట్టిన పెంపుడు పిల్లి.. య‌జమానికి రూ. 11ల‌క్ష‌ల న‌ష్టం!

Cat in China accidentally turns on cooker and sets house on fire

  • చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఘ‌ట‌న‌
  • పిల్లి వంటగదిలో ఆడుకుంటూ పొర‌పాటున‌ ఇండక్షన్ కుక్కర్‌ టచ్ ప్యానెల్‌పై కాలు మోపడంతో సంభ‌వించిన‌ ప్ర‌మాదం
  • ఈ సంఘటనను త‌న త‌ప్పిదంగా పేర్కొన్న ఇంటి యజమాని దండ‌న్‌

 చైనాలో ఓ పెంపుడు పిల్లి ఇంటిని త‌గ‌ల‌బెట్టింది. ఈ ఘ‌ట‌న నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే దండ‌న్ అనే మ‌హిళ‌ ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు జిన్‌గూడియావో. అయితే, ఆ పిల్లి వంటగదిలో ఆడుకుంటూ పొర‌పాటున‌ ఇండక్షన్ కుక్కర్‌ టచ్ ప్యానెల్‌పై కాలు మోపడంతో స్ట‌వ్ అంటుకొని వంట‌గ‌ది మొత్తం కాలిపోయింది. 

ఈ ఘ‌ట‌న‌తో యజమాని దండ‌న్‌కు 1,00,000 యువాన్లు (సుమారు రూ. 11 లక్షలు) నష్టం వాటిల్లింది. ఇక స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘటనాస్థ‌లికి చేరుకుని మంట‌లను ఆర్పివేశారు. అనంత‌రం క్యాబినెట్‌లో బూడిద‌లో కూరుకుపోయిన పిల్లిని గుర్తించి కాపాడారు. దాంతో ఈ ప్ర‌మాదం నుంచి పిల్లి సురక్షితంగా బయటపడింది.  

ఇక‌ ఈ సంఘటనను ఇంటి యజమాని త‌న త‌ప్పిదంగా పేర్కొన్నారు. కుక్కర్‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రాను ఆపివేయక‌పోవ‌డం వ‌ల్లే అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింద‌ని, ఇది పూర్తిగా త‌న త‌ప్పు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మ‌రోసారి ఇలాంటి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌కుండా మరింత జాగ్రత్తగా ఉంటాన‌ని దండ‌న్ చెప్పుకొచ్చారు.

China
Cat
Fire Accident
  • Loading...

More Telugu News