MCMC: వైసీపీకి అనుకూలంగా ఎంసీఎంసీ వ్యవహరిస్తోంది: ఈసీకి ఫిర్యాదు చేసిన విపక్షాలు

Opposition parties complains to EC on MCMC
  • వైసీపీ ప్రకటనల్లో ప్రభుత్వ లోగో ఉంటోందన్న విపక్షాలు
  • ఎంసీఎంసీ ఎలా అనుమతిస్తుందన్న ప్రతిపక్ష నేతలు
  • ఈసీ చర్యలు  తీసుకోవాలని వినతి 
నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఎంసీఎంసీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్షాలు నేడు ఫిర్యాదు చేశాయి. 

వైసీపీ ఇస్తున్న ప్రకటనల్లో ప్రభుత్వ లోగో ఉంటోందని, పార్టీ ప్రకటనల్లో ప్రభుత్వ లోగో వాడుతున్నా ఎంసీఎంసీ అభ్యంతరం పెట్టడంలేదని ప్రతిపక్ష నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ లోగోతోనే వైసీపీ ప్రచారం కొనసాగుతోందని వివరించారు. లోగో వాడకానికి ఎంసీఎంసీ ఎలా అనుమతిస్తుందని వారు ఆక్షేపించారు. ఎంసీఎంసీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
MCMC
Opposition Parties
EC
YSRCP
Andhra Pradesh

More Telugu News