Adeep Raj: పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ ను పెండింగ్ లో ఉంచిన ఆర్వో

RO put Pendurti YCP Candidate Adeep Raj nomination in pending

  • ఏపీలో నిన్నటితో ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
  • నేడు నామినేషన్ల పరిశీలన
  • కేసుల వివరాలు పేర్కొనలేదంటూ అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్

ఏపీలో నామినేషన్ల దాఖలు పక్రియ నిన్నటితో ముగియగా, నేడు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. కాగా, అనకాపల్లి జిల్లా పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలను పొందుపరచలేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 లోపు వివరణ ఇవ్వాలంటూ అదీప్ రాజ్ కు ఆర్వో సమయం ఇచ్చారు. 

పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పోటీ చేస్తుండగా, కూటమి తరఫున జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ బరిలో దిగారు.

Adeep Raj
Nomination
Pending
Pendurti
YSRCP
  • Loading...

More Telugu News