Yanamala Krishnudu: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు... వైసీపీలో చేరికకు రంగం సిద్ధం

Yanamala Krishnudu resigns for TDP

  • తుని రాజకీయాల్లో కీలక పరిణామం
  • 42 ఏళ్లుగా టీడీపీ కోసం పాటుపడ్డానన్న యనమల కృష్ణుడు
  • కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపణ
  • జగన్ ఆహ్వానంతో వైసీపీలోకి వెళుతున్నానని వెల్లడి

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు రాజీనామా ప్రకటన చేశారు. 

42 ఏళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడంలేదని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళుతున్నానని కృష్ణుడు వెల్లడించారు. 

కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్ టీడీపీకి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 

2014, 2019 లో తుని నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఈసారి తుని టికెట్ ను టీడీపీ హైకమాండ్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే, కృష్ణుడు టీడీపీని వీడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News