David Warner: వార్నర్ ను పక్కనబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్

David Warner lost his place in Delhi Capitals final eleven due to poor form

  • ఫామ్ కోల్పోయిన వార్నర్
  • ఇటీవల వరుసగా విఫలం
  • నేడు ఢిల్లీ క్యాపిటల్స్ × గుజరాత్ టైటాన్స్
  • వార్నర్ స్థానంలో షాయ్ హోప్ ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ తాజా సీజన్ లో వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పక్కనబెట్టింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్... గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుండగా, వార్నర్ కు తుదిజట్టులో స్థానం దక్కలేదు. వార్నర్ స్థానంలో షాయ్ హోప్ ను జట్టులోకి తీసుకున్నారు. లలిత్ యాదవ్ స్థానంలో సుమిత్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. 

ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో మార్పులేవీ లేవని గుజరాత్ సారథి శుభ్ మాన్ గిల్ చెప్పాడు. 

టోర్నీలో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ ల్లో నెగ్గి ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్ ల్లో నెగ్గి 8వ స్థానంలో ఉంది.

David Warner
Delhi Capitals
Gujarat Titans
IPL 2024
  • Loading...

More Telugu News