Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు

Delhi Court directs AIIMS to form medical board examine jailed Arvind Kejriwal amid insulin row

  • ప్రతిరోజు వైద్యుడిని సంప్రదించేందుకు పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు
  • అవసరమైతే ఎయిమ్స్ నిపుణులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తనకు తన భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజు 15 నిమిషాల పాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని, డాక్టర్ కన్సల్టేషన్‌తో ఇన్సులిన్ తీసుకుంటానని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

జైల్లో ఉన్న వారందరికీ ఓకే నిబంధన వర్తిస్తుందని... జైలు డాక్టర్లు అవసరమైన వైద్యం అందిస్తారని పిటిషన్‌ను విచారించిన కోర్టు తెలిపింది. అదే సమయంలో అవసరమైతే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిపుణులతో కలిపి ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News