Priyanka close aide: ప్రియాంక గాంధీకి షాకిచ్చిన అనుచరుడు.. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన తజీందర్ సింగ్

Priyanka Gandhi close aide joins BJP after resigning from Congress

  • కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ
  • పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
  • గంటల వ్యవధిలోనే బీజేపీ కండువా కప్పుకున్న తజీందర్

కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు ఆమె సన్నిహిత అనుచరుడు తజీందర్ షాకిచ్చారు. శనివారం కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆపై గంటల వ్యవధిలోనే బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. శనివారం వెంటవెంటనే చోటుచేసుకున్న ఈ ఘటనలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన తజీందర్ సింగ్ బిట్టూ.. హిమాచల్ ప్రదేశ్ కు ఏఐసీసీ సెక్రెటరీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా తజీందర్ కు పేరుంది. ఈ క్రమంలోనే తజీందర్ రాజీనామా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తజీందర్ తన రాజీనామా లేఖ పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని చెబుతూ లేఖ రాశారు.

తన రాజీనామాను ఆమోదించాలని ఖర్గేను కోరారు. అయితే, రాజీనామాకు గల కారణాన్ని మాత్రం తజీందర్ సింగ్ వెల్లడించలేదు. ఉదయం ఖర్గేకు లేఖ రాసిన తజీందర్ సింగ్ బిట్టూ మధ్యాహ్నం బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News