Kiran Kumar Reddy: భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు

Police file case against Chamala Kiran Kumar Reddy

  • భూకబ్జా ఆరోపణలపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
  • రాగన్నగూడలో తన 200 గజాల ప్లాట్‌ను కబ్జా చేశారని రాధిక అనే మహిళ ఫిర్యాదు
  • 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

భువనగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల 13వ తేదీన కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రాగన్నగూడలోని తన 200 గజాల ఫ్లాట్ కబ్జా చేశారని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 447, 427, 506 సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ... ప్లాటును కిరణ్ కుమార్ రెడ్డి 2003లోనే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. రాధిక వద్ద 2015లో ప్లాట్ కొనుగోలు చేసినట్లుగా పత్రాలు ఉన్నట్లు తెలిపారు. ఇద్దరి డాక్యుమెంట్లను తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని ఆదిభట్ల పోలీసులు తెలిపారు.

Kiran Kumar Reddy
Yadadri Bhuvanagiri District
Lok Sabha Polls
Congress
  • Loading...

More Telugu News