Tirumala: తిరుమల శేషాచలం అడవుల్లో మరోసారి కార్చిచ్చు

Wild fire at Tirumala Seshachala forest
  • వేసవి కాలంలో తిరుమల కొండల్లో తరచుగా కార్చిచ్చు
  • తాజాగా పార్వేట మండపం సమీపంలో మంటలు
  • మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
వేసవి కాలం వచ్చిందంటే తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. 

పార్వేట మండపం శ్రీగంధం పార్కు సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

కాగా, ఈ మంటలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. శేషాచలం అడవుల్లో మంటలు కనిపించిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలోని విజువల్స్ ప్రకారం గత రాత్రి నుంచే శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
Tirumala
Wild Fire
Seshachala Forest
TTD

More Telugu News