Google Lay Offs: చెప్పినట్టే ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న గూగుల్.. ఈసారి మరికొందరిపై వేటు

Search Engine Giant Google Lays Off More Employees
  • ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తొలగిస్తున్నట్టు వెల్లడి
  • ప్రభావిత ఉద్యోగుల్లో కొందరిని ఇండియా, షికాగో, అట్లాంటా, డబ్లిన్ పంపే అవకాశం
  • తొలగింపులు ఉంటాయని ఈ ఏడాది మొదట్లోనే చెప్పిన సుందర్ పిచాయ్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మరోమారు ఉద్యోగులపై పడింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. అయితే, ఈ తొలగింపులు అంతటా ఉండవని, ప్రభావిత ఉద్యోగులు కంపెనీలోని అంతర్గత రోల్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

ప్రభావిత ఉద్యోగుల్లో అతి కొద్దిమందిని ఇండియా, షికాగో, అట్లాంటా, డబ్లిన్‌కు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరత కారణంగా కొనసాగుతున్న తొలగింపులు ఈ ఏడాది అంతటా కొనసాగే అవకాశం ఉంది. మరింత సమర్థవంతంగా, మరింత మెరుగ్గా పనిచేసేందుకు 2023 ద్వితీయార్థ నుంచి ఇప్పటి వరకు తమ బృందాలు పలుమార్పులు చేసినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. 

‘బిజినెస్ ఇన్‌సైడర్’ కథనం గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు ఉంటాయి. ఫైనాన్స్ బృందాల్లో గూగుల్ ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్, రెవెన్యూ క్యాష్ ఆపరేషన్స్ కూడా ప్రభావితం కానున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్‌‌లలో కంపెనీని మరింతగా విస్తరించనున్నట్టు గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పొరాట్ సిబ్బందికి ఈమెయిల్ చేశారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు పెంచిన గూగుల్ జనవరిలో ఇంజినీరింగ్, హార్డ్‌వేర్, అసిస్టెంట్ టీమ్‌లతో సహా వందలాదిమంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు భారీగానే ఉంటుందని ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
Google Lay Offs
Search Engine
Lays Off
Business News
Alphabet

More Telugu News