Namitha: ఎన్నిక‌ల బ‌రిలో సీనియ‌ర్‌ హీరోయిన్‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై పోటీకి సై అంటున్న న‌మిత‌!

Heroine Namitha Key Decision on Tamil Nadu Assembly Elections 2026
  • 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న‌ట్లు న‌మిత‌ వెల్ల‌డి
  • తెలివైన ప్ర‌త్య‌ర్థిపై పోటీ చేస్తే రాజ‌కీయ ఎదుగుద‌ల ఉంటుంద‌న్న సీనియ‌ర్ హీరోయిన్‌
  • అందుకే విజ‌య్‌పై పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు వ్యాఖ్య‌
  • ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా కొనసాగుతున్న న‌మిత
2026 లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల బ‌రిలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలామంది సెల‌బ్రిటీలు పోటీ చేయ‌నున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు సినీయ‌ర్ హీరోయిన్ న‌మిత కూడా చేరారు. 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అది కూడా ద‌ళ‌ప‌తి విజ‌య్‌ను ఢీకొన‌బోతున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు.  

"2026 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా విజ‌య్‌పై పోటీ చేస్తాను. తెలివైన ప్ర‌త్య‌ర్థిపై పోటీ చేస్తే రాజ‌కీయ ఎదుగుద‌ల ఉంటుంది. అందుకే విజ‌య్‌పై పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అత‌ను కూడా రాజ‌కీయాల్లో రాణించాల‌ని కోరుకుంటున్నాను" అని న‌మిత చెప్పుకొచ్చారు. 

ఇక ఈ విష‌యం తెలిసిన నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంద‌రు న‌మిత‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని చ‌మ‌త్క‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం విజ‌య్‌పై న‌మిత విజ‌యం సాధించే అవ‌కాశం ఉందంటున్నారు. కాగా, ప్ర‌స్తుతం న‌మిత త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా కొనసాగుతున్నారు. దీంతో ఆమె ప్ర‌స్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.   

ఇక హీరో విజ‌య్ 2026 తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా ఇటీవ‌లే 'తమిళక వెట్రి కజగం' అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పార్టీ 2024 పార్లమెంటు ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు, పోటీ చేయదని కూడా ఆయ‌న ఈ పార్టీ స్థాప‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొనడం జ‌రిగింది.
Namitha
Vijay
Tamil Nadu Assembly Elections 2026
Kollywood

More Telugu News