Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meeting with Bhuvanagiri Parliamentary Constituency leaders
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ సభకు ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Komatireddy Raj Gopal Reddy
Lok Sabha Polls
Yadadri Bhuvanagiri District

More Telugu News