నా లైఫ్ ఇంతలా మారిపోతుందనుకోలేదు: హీరోయిన్ వైష్ణవి చైతన్య
- అమ్మతో కలిసి సినిమా ఫంక్షన్స్ కి వెళ్లేదానినన్న వైష్ణవి
- సినిమా వాళ్లతో ఫొటో దిగాలని ఉండేదని వెల్లడి
- సినిమా వాళ్లది వేరే లోకంగా అనిపించేదని వ్యాఖ్య
- తన ఎదుగుదల చాలా సంతోషంగా ఉందని వివరణ
'లవ్ మీ' సినిమా టీమ్ చాలా ఫాస్టుగా .. చాలా ఎనర్జిటిక్ గా పనిచేసింది. ఈ సినిమా ఇంత స్పీడ్ గా ఆడియో ఫంక్షన్ వరకూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు నేను .. మా అమ్మ కలిసి ఆడియో ఫంక్షన్స్ కి వచ్చేవాళ్లం. సినిమావాళ్లు కనిపిస్తారేమోనని .. ఫొటో దిగుదామని వెయిట్ చేసేవాళ్లం. కానీ రెండో సినిమాకే నేను ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్నాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయంలా నాకు అనిపిస్తోంది" అంది.
"సినిమా వాళ్లది వేరే లోకం .. అక్కడికి వెళ్లడం నాలాంటి వారి వలన కాదని నేను అనుకుంటూ ఉండేదానిని. కానీ ఈ రోజున నేను పెద్ద పెద్ద వాళ్లతో కలిసి ఈ ఫంక్షన్ లో ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో నాకే అర్థం కావడం లేదు. నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. కీరవాణిగారు నాతో ఓ పాట పాడించడం ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పింది.