Nissan Motor Sports International: ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరిన 'కుర్చీ మ‌డ‌త‌పెట్టి..' సాంగ్ మేనియా.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Nissan Motor Sports International Promote their New brand Car with Kurchi Madathapetti Song

  • మ‌హేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని పాట 
  • నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ త‌న కొత్త బ్రాండ్ కారు తాలూకు వీడియోకు ఈ పాట‌ను జోడించిన వైనం
  • అమెరికాలోని హూస్ట‌న్‌లో జ‌రిగే నేష‌న‌ల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లోనూ మారుమ్రోగిన సాంగ్‌

ఈ సంక్రాంతికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' మూవీతో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్రిన్స్ మాస్ అవ‌తార్ ఆయ‌న ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించింది. మ‌రోవైపు మ‌హేశ్‌తో జ‌త‌క‌ట్టిన శ్రీలీల త‌న డ్యాన్స్‌తో థియేట‌ర్ల‌లో విజిల్స్ వేయించింద‌నే చెప్పాలి. 

ఇక ఈ చిత్రంలోని 'కుర్చీ మ‌డ‌తపెట్టి..' పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ సాంగ్ క‌ట్టిప‌డేసింది. ఈ పాట‌పై వ‌చ్చిన రీల్స్‌తో సోష‌ల్ మీడియా ద‌ద్ద‌రిల్లి పోయింది. సినిమా వ‌చ్చి నెల‌లు గ‌డుస్తున్న కూడా ఇప్ప‌టికీ ఈ పాట వినిపిస్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ఈ సాంగ్ క్రేజ్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం. చాలామంది సెల‌బ్రెటీలు కూడా ఈ పాట‌కు స్టెప్పులేసి నెట్టింట పెట్టారు. 

ఇప్పుడు కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ క్రేజ్ అంత‌ర్జాతీయ స్థాయికి పాకింది. అమెరికాలోని హూస్ట‌న్‌లో జ‌రిగే నేష‌న‌ల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లోనూ ఈ పాట మారుమ్రోగింది. అక్క‌డివారు ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టారు. ఇక ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ 'నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంట‌ర్నేష‌న‌ల్' తాజాగా మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చిన కొత్త కారు లాంచింగ్‌ వీడియోకు కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాట‌ను జోడించింది. ఈ వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై మ‌హేశ్ బాబు అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by NISMO (@nismo)

Nissan Motor Sports International
Gunturukaram Movie
Kurchi Madathapetti Song
Tollywood
Mahesh Babu
  • Loading...

More Telugu News