IPL 2024: ముంబై తొలి విజ‌యంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పంద‌న ఇదీ!

Hardik Pandya Reacts After Mumbai Indians Register Their First Win of IPL 2024
  • ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యం న‌మోదు చేసిన ముంబై ఇండియ‌న్స్
  • సార‌ధి హార్దిక్ పాండ్యాకు భారీ ఉప‌శ‌మ‌నం 
  • తొలి విజ‌యంపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా స్పందించిన పాండ్యా
ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో హ్యాట్రిక్ ఓటములతో డీలాప‌డ్డ‌ ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఎట్టకేలకు తొలి విజ‌యం సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) తో వాంఖ‌డే మైదానంలో జ‌రిగిన మ్యాచులో ముంబై 29 ప‌రుగుల తేడాతో డీసీని చిత్తు చేసింది. ఇక తొలిసారి ఎంఐ కెప్టెన్సీ చేప‌ట్టిన హార్దిక్ పాండ్యా వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే, నిన్న‌టి మ్యాచులో విజ‌యంతో పాండ్యాకు భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. 

అటు ఈ విజ‌యంతో ముంబై ఫ్రాంచైజీ పాయింట్ల ఖాతా తెరిచింది. ఈ సంద‌ర్భంగా సార‌ధి హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించాడు. 'మేము లేచి పరుగందుకున్నాం' అనే క్యాప్ష‌న్‌తో మ్యాచ్ తాలూకు కొన్ని ఫొటోల‌ను పాండ్యా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు త‌మ అభిమాన ఫ్రాంచైజీ తొలి విక్ట‌రీని న‌మోదు చేయ‌డం ప‌ట్ల ఎంఐ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇకపై వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లాల‌ని వారు కోరుతున్నారు.
IPL 2024
Hardik Pandya
Mumbai Indians
Cricket
Sports News

More Telugu News