రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప-2 నుంచి సూపర్ టీజర్
- ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకోనున్న అల్లు అర్జున్
- రేపు ఉదయం 11.07 గంటలకు పుష్ప-2 టీజర్ విడుదల
- పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్న అభిమానులు
చిత్రబృందం చెబుతున్న విషయాలను బట్టి చూస్తే పుష్పరాజ్ విశ్వరూపాన్ని ఈ టీజర్ ఆవిష్కరిస్తుందని అర్థమవుతోంది. గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ రూపకల్పన కోసం శ్రమిస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న అప్ డేట్లు చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్నారు. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని సింహాసనంపై కూర్చుని ఉండడం చూడొచ్చు.
