ఉండవల్లిలో నారా లోకేశ్ ను కలిసిన సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉండవల్లిలో నారా లోకేశ్ ను కలిసిన సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ

Actor Prudhviraj met Nara Lokesh on Undavalli
  • ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు
  • జనసేన పార్టీలో కొనసాగుతున్న పృథ్వీ
  • టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచార కార్యక్రమాలపై లోకేశ్ తో చర్చ
సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ రాజ్ నేడు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం పృథ్వీ మాట్లాడుతూ, ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

2019లో వైసీపీ గెలిచినప్పుడు తాను తాడేపల్లిలో టపాసులు కాల్చానని, ఈసారి వైసీపీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని పృథ్వీ స్పష్టం చేశారు. ఈసారి జగన్ కు ప్రజలతో పాటు ప్రకృతి కూడా జవాబిస్తుందని వ్యాఖ్యానించారు.

షర్మిల వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ... జగనన్న వదిలిన బాణం వైసీపీనే పొడుస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ వదిలిన బాణం పోటుకు 12 శాతం ఓట్లపై ప్రభావం పడుతుందని అన్నారు. 
Advertisement
Prudhvi Raj
Nara Lokesh
Janasena
TDP-JanaSena-BJP Alliance
Undavalli

More Telugu News