Roja: పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా
- పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ
- హాజరైన సీఎం జగన్
- నగరి నుంచి రోజమ్మను గెలిపించాలి అంటూ విజ్ఞప్తి
- నా చెల్లి అంటూ వ్యాఖ్యలు
- ఆనందంతో ఉప్పొంగిన మంత్రి రోజా
ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. తన ప్రసంగం సందర్భంగా సీఎం జగన్... నగరి నుంచి రోజమ్మ పోటీ చేస్తోంది... నా చెల్లెలు అని వ్యాఖ్యానించారు. మీ చల్లని దీవెనలు నా చెల్లిపై ఉండాలని సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, మంత్రి రోజా తలపై చేయి ఉంచి దీవించారు. జగన్ మాటలతో రోజా ఆనందంతో పొంగిపోయారు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
❝
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 3, 2024
నగరి నుంచి నా చెల్లి రోజమ్మ నిలబడుతోంది మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లి పై ఉండాలని కోరుకుంటున్నా.❜ @ysjagan #RKRojaHatrick #RKRoja #YSJagan pic.twitter.com/Fiie47ulDy