Volunteers: పింఛన్లు ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలి: ఈసీకి లేఖ రాసిన కనకమేడల

Kanakamedala wrote EC on volunteers issue

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఈసీ
  • పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవాలన్న సజ్జల
  • పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కనకమేడల

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా, వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడం కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడం తెలిసిందే. ఈ అంశంపై నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ, పింఛనుదారులు తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సూచించారు. 

దీనిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఆయన ఈసీకి లేఖ రాశారు. పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని సూచించారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News