AP Volunteers: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 11 మంది వలంటీర్లపై వేటు

Chittoor Collector Suspends 11 Volunteers
  • తిరుపతి జిల్లా పరిధిలోని వలంటీర్లపై వేటు
  • ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిచారన్న కలెక్టర్
  • సస్పెండైన వారిలో ఏర్పేడు, నారాయణవనం, రేణిగుంట, పుత్తూరు, బీఎన్ కండ్రిగ వలంటీర్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వలంటీర్లపై ఎన్నికల అధికారులు వరుసగా వేటు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు వలంటీర్లు విధులకు దూరం కాగా తాజాగా మరో 11 మందిని విధుల నుంచి తొలగించింది.

తిరుపతి జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గాను వీరిని విధుల నుంచి తొలగించినట్టు కలెక్టర్ జి. లక్ష్మి తెలిపారు. సస్పెండైన వారిలో ఏర్పేడు మండల పరిధిలో నలుగురు, నారాయణవనం మండల పరిధిలో ముగ్గురు, రేణిగుంట, పుత్తూరు పరిధిలో ఒక్కొక్కరు, బీఎన్ కండ్రిగ పరిధిలో ఇద్దరు ఉన్నారు.
AP Volunteers
Election Commission
Andhra Pradesh
Chittoor District

More Telugu News