Komatireddy Venkat Reddy: తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో విభేదాల అంశంపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే...!

Minister Komatireddy says there is no differences with brother

  • తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టీకరణ
  • తాను లేదా తన సోదరుడు లోక్ సభ టిక్కెట్ అడగలేదని వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కోమటిరెడ్డి
  • కేసీఆర్ అవినీతిని బయటకు తీయడానికి 20 ఏళ్లు పట్టేలా ఉందని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్న మంత్రి

తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చినట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పైవిధంగా ఆయన స్పందించారు. తాను లేదా తన సోదరుడు లోక్ సభ టిక్కెట్ అడగలేదని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రతిమా శ్రీనివాసరావుకు కేసీఆర్ రూ.20వేల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీయడానికి తమకు 20 ఏళ్లు పట్టేలా ఉందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. బీఆర్ఎస్ ఎక్కడా పోటీలో లేదన్నారు.

Komatireddy Venkat Reddy
Komatireddy Raj Gopal Reddy
Congress
BRS
KCR
  • Loading...

More Telugu News