IPL-2024: ఐపీఎల్: బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించిన పంజాబ్ కింగ్స్

Punjab Kings set RCB 177 runs target
  • చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసిన పంజాబ్  

ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

కెప్టెన్ శిఖర్ ధావన్ 45, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 27, ప్రభ్ సిమ్రన్ సింగ్ 25, శామ్ కరన్ 23 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జానీ బెయిర్ స్టో 8, లియామ్ లివింగ్ స్టన్ 17 పరుగులకే అవుటయ్యారు. 

ఆర్సీబీ బౌర్లలో మహ్మద్ సిరాజ్ 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ 2, యశ్ దయాళ్ 1, అల్జారీ జోసెఫ్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News