Somireddy Chandra Mohan Reddy: బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం విజయసాయికి ఏమొచ్చింది?: సోమిరెడ్డి

Somireddy slams Vijayasai Reddy on Visakha drugs issue

  • విశాఖలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
  • బ్రెజిల్ నుంచి ఏపీ తీరానికి 25 వేల కిలోల డ్రగ్స్
  • రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న సోమిరెడ్డి
  • దీని వెనుక జగన్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలు

విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బ్రెజిల్ దేశం నుంచి విశాఖ తీరానికి డ్రగ్స్ రవాణా జరగడం పట్ల సోమిరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నిలదీశారు. 

గతంలో బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తాజాగా సోమిరెడ్డి ప్రస్తావించారు. 

"అనధికారిక డ్రగ్ సరఫరాలో ప్రపంచాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. అలాంటి దేశాధ్యక్షునితో విజయసాయిరెడ్డికి ఏం పని? బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనపుడు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు అదే దేశం నుండి 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ వచ్చిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

డ్రగ్స్ ఫ్రీ దేశం కోసం ప్రజలంతా తాపత్రయపడుతుంటే... జగన్ రెడ్డి ఏపీని డ్రగ్ క్యాపిటల్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. 

"ఈ డ్రగ్స్ వ్యవహారం మొత్తం వెనుక జగన్ రెడ్డి ఉన్నారు. సీబీఐ అధికారుల్ని రాష్ట్ర పోలీసులు నిలువరించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం తప్పకుండా ఉంది. నెల్లూరు జిల్లా వాసినని చెప్పుకునే విజయసాయిరెడ్డి 2016 నుండి ఎంపీగా ఉండి జిల్లాకు ఏం చేశాడో సమాధానం చెప్పాలి.  నెల్లూరు జిల్లాలో పుట్టిన నులిపురుగు విజయసాయిరెడ్డి. వేల కోట్ల ప్రజల సొమ్ము దిగమింగి 16 నెలలు చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదం. నెల్లూరులో ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. 

మంత్రి రోజా ఇప్పటి వరకు తన శాఖకు సంబంధించి ఒక్కసారి కూడా రివ్యూ పెట్టింది లేదు. శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలియదు. కానీ, నోరేసుకుని పడిపోవడంలో మాత్రం ముందున్నారు.

జగన్ రెడ్డి హీరో కాదు జీరో అని మరో 40 రోజుల్లో ప్రజలు నిరూపించబోతున్నారు. కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ తో సమాజాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సన్నాసుల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు" అని సోమిరెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News