Drugs: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం... 25 వేల కిలోల నిషిద్ధ మాదకద్రవ్యాలు పట్టివేత

Huge amount of drugs captured in Visakha
  • బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా భారత్ వచ్చిన కంటైనర్
  • సీబీఐకి సమాచారం అందించిన ఇంటర్ పోల్
  • విశాఖలోని సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసిన ఢిల్లీ సీబీఐ ఆఫీసు
  • ఆపరేషన్ గరుడ చేపట్టి కంటైనర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు

విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు. 

ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ సీబీఐ కార్యాలయం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ... అందులో ఉన్నది నిషిద్ధ మాదకద్రవ్యాలు అని నిర్ధారించుకుంది. 

25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరిట నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ ఎగుమతుల ద్వారా భారత్ కు వచ్చినట్టు సమాచారం అందుతోంది.

  • Loading...

More Telugu News