Raipur Mall Kid: షాపింగ్ మాల్ లో తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు దుర్మరణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

Boy Slips From Fathers Arms Falls To Death In Raipur Mall

  • ఆసుపత్రికి తరలించినా దక్కని చిన్నారి ప్రాణం
  • ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఏడాది వయసున్న బాబును కోల్పోయింది. కన్న తండ్రి చేతుల్లో నుంచి జారిన పసికందు పైనుంచి కిందపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా బాబు ప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ వీడియో వివరాలు..

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట షాపింగ్ కోసం వచ్చింది. భార్య షాపింగ్ చేస్తుండగా పిల్లలతో కలిసి భర్త బయట నిలుచున్నాడు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, మరొకరు ఏడాది వయసున్న పసికందు. ఇంతలో ఎస్కలేటర్ ఎక్కేందుకు పెద్ద కొడుకు మారాం చేయడం, వద్దంటూ తండ్రి కట్టడి చేయడం కనిపించింది.

ఈ క్రమంలో భుజానికి ఎత్తుకున్న చిన్న కొడుకు జారి కిందపడ్డాడు. పై ఫ్లోర్ నుంచి కింద పడడంతో బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాబు ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. తన చేతుల్లో నుంచి కొడుకు జారి పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు.

Raipur Mall Kid
Infant Death
Chattisgarh
Falls to death
Shopping mall
Viral Videos
  • Loading...

More Telugu News