Chutneys: షర్మిల వియ్యంకురాలి ‘చట్నీస్’ రెస్టారెంట్ లో ఐటీ రెయిడ్స్

IT Officers Raids In Chutneys Hotels In HYderabad
  • హైదరాబాద్ చట్నీస్ రెస్టారెంట్ లో సోదాలు చేస్తున్న అధికారులు
  • చట్నీస్ ఓనర్ అట్లూరి పద్మ నివాసంలోనూ తనిఖీలు!
  • ఇటీవలే షర్మిల కొడుకుతో పద్మ కుమార్తె వివాహం

హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్’ లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హోటల్ లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా రెస్టారెంట్ యజమాని అట్లూరి పద్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. చట్నీస్ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలు కావడం గమనార్హం. ఇటీవలే షర్మిల కొడుకు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. 

జంటనగరాల్లో చట్నీస్ రెస్టారెంట్స్ పేరొందాయి.  ప్రస్తుతం సిటీలో పలు బ్రాంచీలను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఐటీ దాడుల వార్త వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ఇటు చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.

మరోవైపు, సిటీలోని మేఘనా ఫుడ్స్ అండ్ ఈటరీస్ లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు బెంగళూరులోనూ మేఘనా ఫుడ్స్ కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. చట్నీస్, మేఘనా ఫుడ్స్ లలో జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం ఐటీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News