AP Volunteers: 33 మంది వాలంటీర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం

AP Govt rerminates 33 volunteers in Chittoor Dist

  • చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వేటు
  • ప్రభుత్వం అప్పగించిన పనులు సక్రమంగా అమలు చేయలేదన్న అధికారులు
  • నిష్పక్షపాతంగా పని చేస్తున్న వారిని తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతల మండిపాటు

చిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

AP Volunteers
Chittoor District
Termination
  • Loading...

More Telugu News