Gandi Babji: టీడీపీకి షాక్.. గండి బాబ్జీ రాజీనామా

Gandi Babji resigns to TDP
  • రెండో జాబితాలో కూడా గండి బాబ్జీకి నిరాశ
  • పెందుర్తి టికెట్ ను ఆశించిన బాబ్జీ
  • త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్న బాబ్జీ
ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీకి విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీ గండి బాబ్జీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. టీడీపీ తొలి జాబితాలో గండి బాబ్జీకి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ఆయన ఆశించారు. అయితే, సెకండ్ లిస్ట్ లో కూడా తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రెండో జాబితాలో తనకు పెందుర్తి టికెట్ వస్తుందని ఆయన ఆశించారు. అయితే, తనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని గండి బబ్జీ తెలిపారు.
Gandi Babji
Telugudesam
Resign

More Telugu News