Tamil Actor Vijay: సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేయొద్దని విన్నపం
- సీఏఏ ఆమోదయోగ్యం కాదన్న విజయ్
- అమలు చేయబోమని నేతలు హామీ ఇవ్వాలన్న నటుడు
- ఈ చట్టంతో ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆవేదన
- సీఏఏను అమలు చేసేందుకు పలు రాష్ట్రాల విముఖత
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ దళిపతి విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చట్టాన్ని అమలుచేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని తాము అమలు చేయబోవడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఏఏ చట్టంపై ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. వివాదాస్పద ఎన్నికల బాండ్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ వివాదాస్పద చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఆరోపించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లపాటు పెండింగులో పెట్టి ఎన్నికల వేళ అమలు చేయడం ఏంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.