హైద‌రాబాద్ విమానాశ్ర‌యానికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం

International Award for Hyderabad Air port
షార్ట్స్‌లో చూడండి
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ప్ర‌యాణికుల‌కు ఉత్తమ సేవ‌లు అందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం ల‌భించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ స‌ర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023 ఏడాదికి గాను ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో హైద‌రాబాద్ ఉత్త‌మ విమానాశ్ర‌యంగా నిలిచింద‌ని జీఎంఆర్ సంస్థ తెలిపింది. 

ఏడాదికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్ర‌యాణికుల‌కు సేవ‌లు అందిస్తూ, ప్ర‌పంచంలోని 400 విమానాశ్ర‌యాలు ఈ అవార్డు కోసం పోటీ ప‌డ్డాయి. 30కి పైగా ప‌నితీరు సూచిక‌ల ఆధారంగా అంతిమ విజేత‌ను నిర్ణ‌యించారు. ఇక ఈ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల జీఎంఆర్ హైదరాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం సీఈఓ ప్ర‌దీప్ ప‌ణిక‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్వ‌హ‌ణ‌లో భాగ‌మైన అంద‌రికీ ఈ పుర‌స్కారాన్ని అంకితం చేశారు. అలాగే ఎయిర్‌పోర్ట్ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌లో భాగంగా టెర్మిన‌ల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌక‌ర్యాలు, మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad Air port
International Award
Hyderabad
Telangana

More Telugu News