Apollo Hospital: అయోధ్యలో అపోలో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రతాప్ సి రెడ్డి, ఉపాసన

Pratap C Reddy and Upasana launches Apollo Hospital Services in Ayodhya

  • దేశవ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల సేవల విస్తరణ
  • ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలోనూ అపోలో ఆసుపత్రి నిర్మాణం
  • యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసి బ్రోచర్ అందించిన ఉపాసన 

దేశవ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల సేవలను విస్తరించే క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్యలోనూ అపోలో ఆసుపత్రిని నెలకొల్పారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన అపోలో ఆసుపత్రిని అపోలో సంస్థల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి, ఆయన మనవరాలు, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన నేడు ప్రారంభించారు. 

ఈ క్రమంలో ఉపాసన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి ఆయనకు ఆసుపత్రి ప్రారంభోత్సవ బ్రోచర్ ను అందజేశారు. అయోధ్యలో ఉన్నతస్థాయి వైద్య సేవలు అందించడం కోసం అపోలో ఆసుపత్రిని ప్రారంభించడంపై సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాసన, ప్రతాప్ సి రెడ్డిలకు అభినందనలు తెలిపారు.

Apollo Hospital
Ayodhya
Upasana
Pratap C Reddy
Uttar Pradesh
  • Loading...

More Telugu News