Vishwambhara: 'విశ్వంభర'లో ఇటు సాధారణ కన్యగా .. అటు దేవకన్యగా త్రిష!

Vishwambhara Movie Update
  • షూటింగు దశలో 'విశ్వంభర' 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న త్రిష 
  • ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా టాక్ 
  • జనవరి 10వ తేదీన సినిమా విడుదల

చిరంజీవి కథానాయకుడిగా 'విశ్వంభర' సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ టచ్ తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి 'దొరబాబు' అనే పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రధానమైన కథానాయికగా త్రిషను తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందనేది తాజా సమాచారం. 

ఈ సినిమాలో 'త్రిష' భూలోకానికి చెందిన సాధారణమైన కన్యగాను, దేవలోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రలలోను త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. చిరంజీవి - త్రిష .. ఈ ఇద్దరి పాత్రలు ఇటు క్లాస్ గాను .. అటు మాస్ గాను కనిపిస్తాయని చెబుతున్నారు. 

ఇటు భూలోకానికి .. అటు దేవలోకానికి సంబంధించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని టాక్. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. చిరంజీవికి చెల్లెళ్లుగా .. ఇతర దేవకన్యలుగా మరికొందరు హీరోయిన్స్ తెరపై కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా, జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News