Oscars 2024: ఆస్కార్‌-2024 విజేతలు వీరే.. ఉత్తమ చిత్రంగా నిలిచిన ఓపెన్‌హైమర్

These are the winners list of Oscars 2024 and Oppenheimer won many awards

  • అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్‌హైమర్
  • ఓపెన్‌హైమర్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నిలిచిన క్రిస్టోఫర్ నోలన్
  • ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ.. ఓపెన్‌హైమర్‌‌లో అద్భుత నటనకు దక్కిన అవార్డు

ఆస్కార్ అవార్డ్స్ -2024 విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా డైరెక్టర్‌కు ఉత్తమ దర్శకుడిగా, ప్రధాన పాత్రలో నటించిన సిలియన్ మర్ఫీకి ఉత్తమ నటుడిగా అవార్డుల పంట పండించింది. మరిన్ని కేటగిరీలలోనూ ఈ సినిమా అవార్డులను దక్కించుకుంది.

విజేతల లిస్ట్ ఇదే..

ఉత్తమ చిత్రం - ఓపెన్‌హైమర్
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింక్స్)
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ సహాయ నటి: డా'వైన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫెర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ'కానెల్ (బార్బీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? సాంగ్‌కి)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: ది లాస్ట్ రిపేర్ షాప్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: వార్ ఈజ్ ఓవర్!
బెస్ట్ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: పూర్ థింగ్స్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్

Oscars 2024
Oscars 2024 Awards
Oppenheimer
Christopher Nolan
Emma Stone
Cillian Murphy
Movie News
Hollywood
  • Loading...

More Telugu News