Ram Charan: మహిళా దినోత్సవం సందర్భంగా తల్లి, భార్య, నాయనమ్మ కోసం గరిటె తిప్పిన రామ్ చరణ్

Ram Charan cooks Paneer Tikka Masala for his mother and wife on Womens day eve
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • చెఫ్ అవతారమెత్తిన రామ్ చరణ్
  • పన్నీర్ టిక్కా వండిన వైనం
  • వీడియో వైరల్
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తారు. తల్లి సురేఖ, భార్య ఉపాసన, నాయనమ్మ అంజనీదేవి కోసం గరిటె తిప్పారు. పన్నీర్ టిక్కా తదితర వంటలను స్వయంగా చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సురేఖ, అంజనీదేవి కూడా కనిపిస్తారు. ఉపాసన వాయిస్ మాత్రం వినిపిస్తుంది. 

"మీకు తెలుసా... మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు" అని సురేఖ చెప్పగా... "ప్రతి రోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుంది" అని ఉపాసన చమత్కరించారు. అంతేకాదు, "రామ్ చరణ్ గారు... ఏం వండుతున్నారండీ?" అంటూ ఉపాసన కొంటెగా ప్రశ్నించగా, "పన్నీర్ టిక్కా మసాలా మేడమ్" అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు.
Ram Charan
Cooking
Surekha
Upasana Kamineni Konidela
Paneer Tikka
International Women's Day

More Telugu News