England Cricket: ద‌లైలామాను క‌లిసిన ఇంగ్లండ్ క్రికెట‌ర్లు

England Cricket players meet Dalai Lama ahead of Dharamshala Test

  • ధ‌ర్మశాల‌లోని ద‌లైలామా ఇంటికి వెళ్లిన ఇంగ్లండ్ ఆట‌గాళ్లు
  • కొద్దిసేపు ఆయ‌న‌తో మాటా‌మంతీ 
  • గురువారం నుంచి ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఐదో టెస్ట్

ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం నుంచి ఆఖ‌రిదైన ఐదో టెస్టు ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ధ‌ర్మ‌శాల చేరుకున్నారు. ఇక రాంచీ టెస్టు త‌ర్వాత కొంత విరామం దొర‌క‌డంతో ఇంగ్లీష్ ప్లేయ‌ర్లు హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధ‌వారం ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ధ‌ర్మ‌శాల‌లోని ద‌లైలామా ఇంటికి వెళ్లారు. కాసేపు ఆయ‌న‌తో ముచ్చ‌టించారు. ఇలా ద‌లైలామాను క‌లిసిన వారిలో అట్కిన్స‌న్‌, ఒలీ పోప్‌, క్రాలే, టామ్ హ‌ర్ట్లీ, లారెన్స్ ఉన్నారు. 

ఇదిలాఉంటే.. ఐదు టెస్టుల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఆతిథ్య భార‌త్ 3-1తేడాతో చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. మొద‌టి టెస్టు ఇంగ్లండ్ గెల‌వ‌గా.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు టెస్టుల్లో రోహిత్ సేన విజ‌యం సాధించింది.

England Cricket
Players
Dalai Lama
Dharamshala
Cricket
Sports News
  • Loading...

More Telugu News