Family Star: దూసుకుపోతున్న 'ఫ్యామిలీ స్టార్' టీజర్!

Family Star Movie Update
  • విజయ్ దేవరకొండ హీరోగా 'ఫ్యామిలీ స్టార్'
  • దర్శకుడు పరశురామ్ తో రెండో సినిమా 
  • అందరిలో ఆసక్తిని పెంచుతున్న టీజర్
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల

విజయ్ దేవరకొండ హీరోగా 'ఫ్యామిలీ స్టార్' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, పరశురామ్ దర్శకత్వం వహించాడు. గతంలో విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' ఘనవిజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే 'ఫ్యామిలీ స్టార్' సినిమాపై అంచనాలు ఉన్నాయి. 

విజయ్ దేవరకొండ సరసన నాయికగా మృణాల్ నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అందులో భాగంగా నిన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఇప్పటికే యూ ట్యూబ్ లో ఈ టీజర్ 9 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచించింది. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కోట్లని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News