Ramcharan: చరణ్ ని అవమానించలేదు.. తన మూవీలో డైలాగ్ చెప్పాడంటున్న షారుఖ్ అభిమానులు

Shah Rukh Khan Not Insulting Ram Charan He Just Said His Movie Dialogue
  • వీడియోతో సోషల్ మీడియాలో వివరణ
  • అంబానీ ప్రి వెడ్డింగ్ ఫంక్షన్ లో ఖాన్ త్రయంతో చెర్రీ స్టెప్పులు
  • ఆ సమయంలో రామ్ చరణ్ ను షారుఖ్ అవమానించాడంటూ వివాదం

అంబానీల ఇంట జరిగిన ప్రి వెడ్డింగ్ ఫంక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ను వేదికపైకి పిలుస్తూ ఇడ్లీ సాంబార్ అంటూ షారుఖ్ ఖాన్ సంబోధించడంపై చెర్రీ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరోను అవమానించాడని సోషల్ మీడియా వేదికల్లో షారుఖ్ ను విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా షారుఖ్ ఖాన్ అభిమానులు వివరణ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన మూవీలోని ఓ డైలాగ్ ను చెప్పాడని, రామ్ చరణ్ ను అవమానించలేదని స్పష్టం చేశారు. సదరు సినిమాలోని డైలాగ్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి మరీ వివరణ ఇచ్చారు.

షారుఖ్ ఖాన్ నటించిన ‘వన్ 2 కా 4’ మూవీలో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, రజనీకాంత్, వెంకటేశ్, నాగార్జున అంటూ చెబుతాడు. అంబానీ ఈవెంట్ లో చరణ్ ను పిలిచేటప్పుడు షారుఖ్ ఈ డైలాగ్ ను చెప్పాడు. రజనికాంత్ పేరుకు బదులు రామ్ చరణ్ పేరుతో డైలాగ్ మార్చేశాడు. అయితే, సౌత్ ఆడియన్స్ కు ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో.. చరణ్ ను అవమానించారని భావించారు.

  • Loading...

More Telugu News