Anant Ambani-Radhika Merchant Pre Wedding Bash: అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ బాష్.. ‘నాటునాటు’ పాటకు బాలీవుడ్ ఖాన్‌ల అదిరే డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Anant Ambani Radhika Merchant Pre Wedding Celebrations Bollywood Khans Dance on Stage
  • ఒకే వేదికపై సల్మాన్, షారూఖ్, ఆమిర్‌ఖాన్
  • వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల సరదా కామెంట్లు
  • ప్రొడ్యూసర్లు చేయలేని పని అంబానీ చేశాడంటూ నెటిజన్ల విసుర్లు
  • డబ్బు ఎవరితోనైనా, ఎంత పనైనా చేయిస్తుందన్న మరికొందరు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు, బిలియనీర్ల కోసం పసందైన వంటకాలతోపాటు పాప్‌సింగర్ రిహన్నా, అరిజీత్‌సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ వంటివారితో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 

ఇక, బాలీవుడ్ స్టార్ నటులు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఆమిర్‌‌ఖాన్ వంటి వారి డ్యాన్సులతో స్టేజి దద్దరిల్లింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డాన్సర్లుతో కలిసి వేసిన స్టెప్పులకు ఆహూతులు మైమరచిపోయారు. ముగ్గురు ఖాన్‌లు ఒకే వేదికపై కాలు కదిపిన మధుర క్షణాలను చూసి అందరూ మైమరిచిపోయారు. 

‘నాటునాటు’ పాటకు తమదైన స్టెప్పులతో అలరించారు. తొలుత సల్మాన్‌ఖాన్ ‘జీనే కే చార్ దిన్’, ఆమిర్‌ఖాన్ ‘మస్తీ కీ పాఠశాల’, షారూఖ్‌ఖాన్ ‘చయ్య చయ్య’ పాటలకు స్టెప్పులు వేస్తూ క్రమంగా ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్‌లోకి వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తోంది. వ్యూస్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. 

ప్రొడ్యూసర్లు కూడా వారిని ఒక్కదగ్గరికి చేర్చలేకపోయారని, వారు చేయలేని పనిని ముకేశ్ అంబానీ చేశారని, డబ్బు మహిమ అదేనని కొందరు కామెంట్ చేస్తే, డబ్బు ఎవరితోనైనా ఏమైనా చేయిస్తుందని మరికొందరు రాసుకొచ్చారు. ఇంకొందరు మాత్రం వీరి ముగ్గురి డ్యాన్స్ చూడముచ్చటగా ఉందన్నారు. కొందరు మాత్రం వారిని అలా చూడడం బాగాలేదని, వారికి డబ్బులిచ్చి ఉండకపోవచ్చని, అతిథుల్లానే వచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. 

ఇక, ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల్లో అక్షయ్ కుమార్, దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియా, వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్, అనిల్ కపూర్, కుమార్తె సోనమ్ కపూర్, షానయ కపూర్, దిశా పఠానీ వంటివారు హాజరయ్యారు.
Anant Ambani-Radhika Merchant Pre Wedding Bash
Shahrukh Khan
Salman Khan
Aamir Khan
Naatu Naatu
RRR Song
Anant Ambani
Radhika Merchant

More Telugu News