Pavitranath: మొగలిరేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతి

Mogalirekulu fame Pavithanath dead
  • మెగలిరేకులు సీరియల్ లో దయ పాత్రలో నటించిన పవిత్రనాథ్
  • పవిత్రనాథ్ చనిపోయిన విషయాన్ని వెల్లడించిన ఇంద్రనీల్ భార్య మేఘన
  • చివరి చూపు కూడా చూసుకోలేక పోయామని ఆవేదన
బుల్లితెరను మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ఏ రేంజ్ లో షేక్ చేశాయో అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు ఈ సీరియల్స్ వీక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఈ సీరియల్స్ ను ప్రేక్షకులు మరిచిపోలేరు. ఈ సీరియల్స్ లోని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్ర తమ్ముడు దయ పాత్రలో నటించి, మెప్పించిన పవిత్రనాథ్ కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. తమకు కూడా మరణ వార్త తెలియలేదని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

'మా జీవితంలో నీవు చాలా ముఖ్యమైన వాడివి. నీ మరణ వార్త విన్న తర్వాత... అది నిజం కాకూడదని కోరుకున్నా. అది అబద్ధం అయితే బాగుంటుందని అనుకున్నాను. కానీ, నీవు నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం. గుడ్ బై చెప్పలేకపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలి' అని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పవిత్రనాథ్ ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Pavitranath
Mogalirekulu
Dead

More Telugu News