Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

Allahabad HC Upholds Varanasi Court Order In Gyanvapi Mosque Case

  • వారణాసి కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ఏఐఎంసీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
  • జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని వ్యాస్ కా తేఖానాలో హిందువులు పూజలు చేసుకోవచ్చన్న హైకోర్టు
  • సుప్రీంలో కేవియట్ దాఖలు చేస్తామన్న ముస్లిం వర్గం 

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ (ఏఐఎంసీ) అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని ఏఐఎంసీ నిర్ణయించింది. 

 తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు తేఖానాలు (సెల్లార్‌లు) ఉన్నాయి. అందులో ఒకటి వ్యాస్ కుటుంబం అధీనంలో ఉంది. ఈ తీర్పుపై అడ్వకేట్ ప్రభాస్ పాండే మాట్లాడుతూ.. తీర్పు ప్రకారం తేఖానా రిసీవర్‌గా వారణాసి జిల్లా కలెక్టర్ కొనసాగుతారని స్పష్టం చేశారు.

Gyanvapi Mosque Case
Varanasi Court
Allahabad High Court
Hindu Devotees
AIMC
  • Loading...

More Telugu News