David Warner: ఢిల్లీ కేపిటల్స్‌కు బిగ్ రిలీఫ్.. ఆసీస్ స్టార్ బ్యాటర్ రెడీ!

Big Relief For Delhi Capitals Injured David Warner To Be Fit In Time For IPL
  • గజ్జల్లో నొప్పితో బాధపడుతున్న వార్నర్
  • న్యూజిలాండ్ పర్యటనలో చివరి రెండు టీ20లకు దూరం
  • ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశం
  • బాధాకరంగా ముగిసిన చివరి ద్వైపాక్షిక సిరీస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది శుభవార్తే. గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న వార్నర్ ఐపీఎల్‌ నాటికి పూర్తిగా కోలుకుని జట్టులో చేరే అవకాశాలున్నాయి. రిషభ్‌పంత్ ప్రమాదం బారినపడి జట్టుకు దూరం కావడంతో గత సీజన్‌లో ఢిల్లీకి వార్నర్ సారథ్యం వహించాడు.

గజ్జల్లో నొప్పితో బాధపడుతున్న వార్నర్ చివరి ద్వైపాక్షిక పర్యటన బాధాకరంగా ముగిసింది. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో  ఆడలేదు. ఆదివారం జరగనున్న చివరి టీ20 నుంచి కూడా తప్పుకున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో ఆడిన వార్నర్ 20 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్ స్కోరులో మూడు సిక్సర్లు, ఒక బౌండరీ ఉంది.
David Warner
Australia
Delhi Capitals
Team New Zealand

More Telugu News