Arvind Kejriwal: రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారు: ఆప్ నేత భరద్వాజ్

CM Arvind Kejriwal will be arrested in next 2 or 3 days says AAP leader Saurabh Bharadwaj

  • కాంగ్రెస్ తో ఆప్ పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ నేతలు చెపుతున్నారన్న భరద్వాజ్
  • కేజ్రీవాల్ జైల్లో ఉంటే కాంగ్రెస్ తో ఆప్ పొత్తు ఉండదనేది వారి ఆలోచన అని వ్యాఖ్య
  • కేజ్రీవాల్ సురక్షితంగా ఉండాలంటే ఇండియా కూటమి నుంచి తప్పుకోవాలంటున్నారన్న భరద్వాజ్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటి వరకు ఏడు సార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేజ్రీవాల్ ను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో వివిధ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే కేజ్రీవాల్ జైలుకు వెళ్తారని బీజేపీ నేతలే చెపుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ జైల్లో ఉంటే కాంగ్రెస్ తో ఆప్ పొత్తులు ఉండవనేది వారి ఆలోచన అని అన్నారు.  

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు తమను హెచ్చరిస్తున్నాని భరద్వాజ్ మండిపడ్డారు. కేజ్రీవాల్ సురక్షితంగా ఉండాలంటే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు రావాలని చెపుతున్నారని అన్నారు. ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న ప్రతిచోటా తమకు కష్టాలు తప్పవనే భయంలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ తో చర్చలు చివరి దశలో ఉన్నాయని... త్వరలోనే ఇరుపార్టీలు సంయుక్తంగా వివరాలను ప్రకటిస్తాయని అన్నారు. 

  • Loading...

More Telugu News