Ranchi Test: తొలి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ ను వణికించిన ఆకాశ్ దీప్.. కష్టాల్లో ఇంగ్లాండ్

England struggling in Ranchi Test
  • రాంచీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
  • లంచ్ విరామం సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 112/5
  • తొలి మూడు వికెట్లను కుప్పకూల్చిన ఆకాశ్ దీప్
రాంచీలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ చెలరేగాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను వణికించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), వన్ డౌన్ లో వచ్చిన పోప్ (డకౌట్)లను పెవిలియన్ కు చేర్చి టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (38)ను అశ్విన్, బెన్ స్టోక్స్ (3)ను జడేజా ఔట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో లంచ్ విరామం సమయానికి 24.1 ఓవర్లలో 112 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. 
Ranchi Test
Team India
Team England
Akash Deep
Score

More Telugu News