Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Dadasaheb Phalke Awards announced and Here is the list of winners

  • ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, ఉత్తమ దర్శకుడిగా సందీప్ వంగాకు అవార్డులు
  • ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న నయనతార
  • మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రధాన వేడుక

‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో సందడిగా జరిగింది. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్ లో అద్భుతంగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజై వసూళ్ల వర్షం కురిపించిన ‘యానిమల్‌’ సినిమా దర్శకుడు సందీప్‌ వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో సినీసెలబ్రిటీలు సందడి చేశారు.

ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (యానిమల్‌) అవార్డు అందుకున్నారు. క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు యేసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి.

ఇక టీవీ విభాగం విషయానికి వస్తే టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.

Dadasaheb Phalke Awards
shah rukh khan
Nayanthara
Sandeep Reddy Vanga
Bollywood
  • Loading...

More Telugu News