Actor Vijay: పార్టీ విస్తరణకు తమిళ హీరో విజయ్ కీలక సూచనలు

Target of 2 crore new members womens participation Actor Vijays party agenda
  • సోమవారం చెన్నైలో పార్టీ నేతలతో సమావేశం
  • పార్టీలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచన
  • మహిళలు, తొలిసారి ఓటు వేసేవారి మద్దతు కూడగట్టాలని దిశానిర్దేశం
‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తాజాగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో సభ్యుల సంఖ్య 2 కోట్లకు చేరాలంటూ నేతలకు టార్గెట్ విధించారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాల్లో మహిళలు, తొలిసారి ఓటు వేస్తున్న వారి భాగస్వామ్యం కూడా పెంచాలని పిలుపునిచ్చారు. పార్టీ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. 

పార్టీ పునాదులను పటిష్ఠ పరిచేలా జిల్లా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. వివిధ పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు? అనే అంశంపై లెక్కలు సేకరించడంతో పాటు సాధారణ ఓటర్లు, మహిళలు, తొలిసారిగా ఓటు వేసే వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఓ యాప్‌ను సిద్ధం చేయిస్తున్నారు.
Actor Vijay
Tamilnadu
Tamilaga Vettri Kazhagam

More Telugu News