YS Sharmila: కొడుకు రాజారెడ్డి పెళ్లి ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో పంచుకున్న వైఎస్ షర్మిల

YS Sharmila who shared her son RajaReddy wedding photos and video on social media has gone viral

  • అందమైన జంట దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిపిన ఏపీసీసీ అధ్యక్షురాలు
  • ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల
  • జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన రాజారెడ్డి-అట్లూరి ప్రియ పెళ్లి

ఏపీసీసీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో మూడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి-అట్లూరి ప్రియ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు.

‘‘ ఒకరి కోసం మరొకరు పుట్టిన అందమైన జంట దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. మా నాన్న దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నట్టుగా అనుభూతి చెందాను. అద్భుతమైన ఈ వేడుక మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అంతులేని ఆనందం, అనంతమైన ప్రేమతో అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఈ జంటకు నేను అభినందనలు తెలుపుతున్నాను’’ అంటూ ఎక్స్ వేదికగా పెళ్లి వీడియోను వైఎస్ షర్మిల షేర్ చేశారు.

ఇక మరో పోస్టులో.. ‘‘ ఒక అమ్మగా నా జీవితంలో మరో ఆనందకరమైన క్షణం ఇది. ఆత్మీయుల ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు, దేవుడి దయతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. నా కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్న అద్భుతమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

YS Sharmila
RajaReddy-Atluri Priya
Jodpur palace
Marriage
  • Loading...

More Telugu News