YS Sharmila: జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం

YS Sharmilas son Raja Reddys wedding held in Jodhpur and CM Jagan not attended
  • బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగిన పెళ్లి
  • హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న వైఎస్ షర్మిల
  • పెళ్లికి హాజరు కాని షర్మిల సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా వివాహ వేడుక జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘హల్దీ’ వేడుక ఫొటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోల్లో నూతన దంపతులు రాజారెడ్డి-ప్రియా, వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు.

అయితే వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకాలేదు. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ అనివార్య కారణాల వల్ల హాజరుకాలేదని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. వధూవరులు ఇక్కడికి వచ్చాక ప్రత్యేకంగా వెళ్లి ఆశీర్వదించనున్నట్టు పేర్కొంటున్నాయి. కాగా ఫిబ్రవరి 16న మొదలైన మూడు రోజుల పెళ్లి వేడుకలు నేడు (ఆదివారం) ముగియనున్నాయి. ఇప్పటికే సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగాయి. నేడు తలంబ్రాలు, విందు కార్యక్రమాలు జరగనున్నాయి.
YS Sharmila
Rajareddy - Atluri Priya marriage
CM Jagan
Jodpur palace

More Telugu News